హీరో నిఖిల్ లో ఈ యాంగిల్ కూడా ఉందా..?

హ్యాపీడేస్ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యాడు యంగ్ హీరో నిఖిల్. అనంతరం పలు వరుస పరాజయాలను మూటగట్టుకున్న ఈ హీరో… స్వామి రారా చిత్రంతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. అనంతరం కార్తికేయ, ఎక్కడికి పోతావు చిన్నవాడా, కేశవ, అర్జున్ సురవరం వంటి వరుస విజయాలను సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా తనలోని మరో యాంగిల్ కూడా బయట పెట్టడానికి సిద్ధమవుతున్నాడు నిఖిల్. ఇటీవల ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిఖిల్ మాట్లాడుతూ.. ‘త్వ‌ర‌లోనే నేను  చిన్నారుల‌తో ఓ ప్ర‌యోగాత్మ‌క సినిమా చేస్తున్నాను. లాక్ డౌన్ మార్గ‌ద‌ర్శ‌కాలు, సామాజిక దూరం నిబంధ‌న‌లు పాటిస్తూ ఈ సినిమా తీయ‌నున్నాను’ అంటూ చెప్పుకొచ్చాడీ హీరో.

అయితే నిఖిల్ కు ఇదివరకే దర్శకత్వంలో అనుభవం ఉంది. హ్యాపీడేస్ కంటే ముందు హైదరాబాద్ నవాబ్స్ చిత్రానికి నిఖిల్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమాకు దర్శకత్వం వహించడానికి సిద్ధమయ్యాడు నిఖిల్. ఇక ఈ యంగ్ హీరో ప్రస్తుతం.. కార్తికేయ2తో పాటు, 18 పేజీస్ అనే చిత్రాల్లో నటిస్తున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here