మ‌రో ఆరు నెల‌ల్లో క‌రోనా వ్యాక్సిన్‌.. మొద‌టి వ్యాక్సిన్ నాకే

ఇండియాలో కరోనా వైర‌స్ విజృంభిస్తున్న త‌రుణంలో వ్యాక్సిన్‌పైనే అంద‌రూ ఆశ‌లు పెట్టుకున్నారు. ప్ర‌పంచంలోనే అత్య‌ధికంగా క‌రోనా ఇండియాలోనే వేగంగా వ్యాప్తి చెందుతోంది. తాజాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ వెల్ల‌డించిన నివేదిక‌లో ఇది బ‌ట్ట‌బ‌య‌టైంది.

కాగా వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రి, మార్చిలో క‌రోనా వ్యాక్సిన్ వ‌స్తుంద‌ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఆస‌క్తిగా మారాయి. ప్ర‌యోగాల అనంత‌రం వ్యాక్సిన్‌ను తీసుకోవ‌డానికి ఎవ్వ‌రూ ముందుకు రాక‌పోతే తానె ముందుండి వ్యాక్సిన్ తీసుకుంటాన‌ని కేంద్ర మంత్రి చెప్పారు. టీకాపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు తాను ముందుండి టీకా తీసుకుంటాన‌న్నారు. ఇక ప్ర‌పంచంలో చాలా దేశాలు క‌రోనా వ్యాక్సిన్ త‌యారీలో నిమ‌గ్న‌మ‌య్యాయి.

చాలా సంస్థ‌లు మొద‌టి రెండు ద‌శ‌లు దాటి మూడో ద‌శ‌కు చేరుకున్నాయి. ఇక కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్య‌ల్లో క‌రోనా కేసులు దేశంలో త‌క్కువ‌గా ఉన్నాయ‌ని చెప్పారు. ఇదే స‌మ‌యంలో రిక‌వ‌రీ రేటు కూడా ఎక్కువ‌గా ఉంద‌న్నారు. కాగా ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక‌లో మాత్రం భార‌త్‌లో క‌రోనా కేసుల విజృంభ‌ణ ఎక్కువ‌గా ఉంద‌ని పేర్కొంది. భార‌త్‌లో 90 వేల‌కు పైగా కేసులు ప్ర‌తి రోజూ న‌మోద‌వుతూనే ఉన్నాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here