సామ్‌ నయా లుక్‌ అదిరిపోయిందిగా..!

ఏం మాయ చేశావే’ సినిమాతో నిజంగానే ప్రేక్షకులను మాయ చేసింది నటి సమంత. అనంతరం పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన ఈ చిన్నది అక్కినేని నాగ చైతన్యను ప్రేమ వివాహం చేసుకొని తెలుగు వారి కోడలిగా మారింది. అయితే వివాహం తర్వాత కూడా సమంత సినిమాల విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అయితే కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియా ద్వారా కూడా అభిమానులతో నిత్యం టచ్‌లో ఉంటుంది సమంత. ఈ అమ్మడుకి సోషల్‌ మీడియాలో ఫాలోయింగ్‌ కూడా ఎక్కువే.

తాజాగా సమంతను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో అయ్యే వారి సంఖ్య ఏకంగా 12 మిలియన్లకు చేరింది. ఈ సందర్భంగా సమంత తాజాగా దిగిన కొన్ని ఫొటోలను షేర్‌ చేస్తూ అభిమానుందరికీ కృతజ్ఞతలు తెలిపింది. అయితే ఈ ఫొటోల్లో సమంతను చూసిన ఆమె అభిమానులు ఫిదా అవుతున్నారు. మూడు పదుల వయసులోనూ ఇంత అందమేంటని ఆశ్చర్యపోతున్నారు. మరి సమంత పోస్ట్‌ చేసిన ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి.

https://www.instagram.com/p/CFGy3l2B99Z/

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here