చైనా భార‌త్‌లోకి చొర‌బ‌డ‌లేదు.. పార్ల‌మెంటులో ప్ర‌క‌టించిన కేంద్రం

భార‌త్, చైనా మ‌ధ్య కొంత కాలంగా యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విషయం తెలిసిందే. అయితే భార‌త్ ఎన్నిసార్లు చ‌ర్చ‌లు జ‌రిపినా చైనా మాత్రం త‌న వ‌క్ర‌బుద్దిని చాటుకుంటూనే ఉంద‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టిస్తూనే ఉంది. అయితే తాజాగా మాత్రం చైనా ఇంత‌వ‌ర‌కు ఎలాంటి చొర‌బాట్లు చెయ్య‌లేద‌ని స్ప‌ష్టం చేసింది.

ఆరు నెల‌ల నుంచి చైనా భార‌త్‌లోకి చొచ్చుకొని ప్ర‌య‌త్నాలు చేసిన‌ప్ప‌టికీ అధి సాధ్యం కాలేద‌ని కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. అయితే పాకిస్థాన్ మాత్రం భార‌త్‌లోకి చొచ్చుకొని వ‌చ్చేందుకు 47 సార్లు ప్ర‌య‌త్నించింద‌ని తెలిపారు. మంత్రి నిత్యానంద్ ప్ర‌క‌ట‌న‌పై విప‌క్షాలు భ‌గ్గుమ‌న్నాయి. దేశం మొత్తం చైనాపై ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డుతోంద‌ని దుమారం రేగుతుంటే కేంద్రం మాత్రం ఏమీ లేద‌ని చెప్ప‌డం ఏంట‌న్న ప్ర‌శ్న‌లు ఉత్ప‌న్న‌మ‌వుతున్నాయి.

ఇప్ప‌టికే చాలా సార్లు కేంద్ర ప్ర‌భుత్వం చైనా అధికారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపారు. అయితే ఒక‌వైపు చ‌ర్చ‌లు జ‌రుగుతున్నా చైనా మాత్రం తమ సైన్యంతో పాటు భారీగా ఆయుధాలు స‌రిహ‌ద్దులోనికి త‌ర‌లించే ప్ర‌య‌త్నాలు చేసింది. ఇది దాదాపు రెండు మూడు నెల‌ల పాటు ఇలాగే కొన‌సాగింది. ఈ విష‌యం దేశం మొత్తం తెలిసిన విషయ‌మే. అయితే ఎలాంటి చొర‌బాట్లు లేవ‌ని కేంద్రం ప్ర‌క‌టించ‌డం అంద‌రినీ విస్మ‌యానికి గురిచేసిన‌ట్లైంది. చైనా అక్ర‌మ చొర‌బాట్లు చెయ్య‌కుంటే స‌రిహద్దులో యుద్ధ వాతావర‌ణం ఎందుకు ఉంటుంద‌ని దేశం మొత్తం ప్ర‌శ్నిస్తోంది. మ‌రి ఈ విష‌యంపై కేంద్రం ఏ విధంగా ప్ర‌య‌త్నిస్తుందో చూడాలి. ఇక ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ ల‌ద్దాక్ ప్రాంతంలో భార‌త్ క‌ఠిన స‌వాళ్లు ఎదుర్కొంటోంది అన‌డం, తాజాగా హోం శాఖ స‌హాయ మంత్రి నిత్యానంద్ మాట్లాడ‌టం విరుద్ధంగా ఉన్నాయ‌న్న సంకేతాలు ఇస్తున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here