క్యూట్ క‌పుల్‌..చైతన్య,సమంత

హీరో రానా పెళ్లి సంద‌డి విశేషాలు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాయి. మొన్న మిహీకా బ‌జాజ్‌తో రానా పెళ్లి జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఇప్పుడు ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో అంద‌రినీ ఆక‌ర్షిస్తున్నాయి.

హైద‌రాబాద్ రామానాయుడు స్టూడియోలో రానా పెళ్లి వైభ‌వంగా జ‌రిగింది. అయితే ఈ పెళ్లికి కేవ‌లం కుటుంబ సభ్యులు త‌ప్ప మ‌రెవ్వ‌రూ హ‌జారుకాలేదు. సినీ ఇండ‌స్ట్రీకి చెందిన రామ్ చ‌ర‌ణ్‌, ఉపాస‌న దంప‌తులు, అల్లుఅర్జున్‌, ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌లు హాజ‌ర‌య్యారు. ఇక పెళ్లిలో ఫ్యామిలీ మెంబ‌ర్స్ అయిన నాగ‌చైత‌న్య‌, స‌మంత‌లు అట్రాక్ష‌న్‌గా నిలిచారు.

ఒక‌వైపు రానా వివాహం జ‌రుగుతుంటే చైతూ త‌న వైఫ్‌తో ఆట‌లాడుతూ ఎంజాయ్ చేశారు. ఈ విష‌యాలు సోష‌ల్ మీడియాలో ఇప్పుడు వైర‌ల్ అవుతున్నాయి. స‌మంతకు తెలియ‌కుండా ఆమె త‌ల‌పై అక్షింత‌లు వేస్తూ చైతూ చిలిపి చేష్ట‌లు చేశారు. ఈ ఫోటోలు ఇప్పుడు అభిమానుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంటున్నాయి ఇక స‌మంత మిహీకాను ఉద్దేశిస్తూ మా కుటుంబంలోకి స్వాగ‌తం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది.

రానా దంప‌తులు, చైతూ దంప‌తుల ఫోటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. క్యూట్ క‌పుల్ అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here