క‌రోనా టైం.. లీట‌రు పాలు రూ. 7వేలు

గేదె పాలు, ఆవు పాల డైరీలు మ‌నం చూసి ఉంటాం. కానీ ఇప్పుడు ప‌రిస్థితులు మారుతున్న కొద్దీ జీవ‌న‌శైలిలో మార్పులు వ‌స్తున్నాయి. దీంతో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకునేందుకు జ‌నాలు డిఫ‌రెంట్ గా ట్రై చేస్తున్నారు.

ఇప్పుడు ఈ డిస్క‌ర్ష‌న్ అంతా గాడిద పాల గురించే. హ‌ర్యానాలోని హిస్సార్ జిల్లాలో నేష‌న‌ల్ రీసెర్చ్ సెంట‌ర్ ఆన్ ఈక్విన్స్ వారు ఈ గాడిద పాల డైరీని స్టాట్ చేస్తున్నారు. ఇందుకోసం హ‌లారీ గాడిద‌ల‌ను తీసుకొస్తున్నారు. ఈ జాతి పాల‌ల్లో ఔష‌ధ గుణాలు ఎక్కువ‌గా ఉంటాయి. రోగ‌నిరోధక‌ శ‌క్తిని పెంచేందుకు ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

ఈ హ‌లారీ జాతి గాడిద‌లు గుజరాత్‌లో ఎక్కువ‌గా ఉంటాయి. అక్క‌డ వీటి పాల ధ‌ర లీట‌రు రూ. 7వేలు ఉంటుందంట‌. దీంతో గుజ‌రాత్‌లో 10 గాడిద‌ల కోసం ఆర్డ‌ర్ చేసిన‌ట్లు రీస‌ర్చ్ సెంట‌ర్ నిర్వాహ‌కులు తెలిపారు. గాడిద‌ పాల‌ను చిన్న పిల్ల‌ల‌కు తాపిస్తార‌న్న విష‌యం మ‌న‌కు తెలిసిందే. అల‌ర్జీ, క్యాన్స‌ర్‌, ఆస్త‌మా త‌దిత‌ర వ్యాధుల‌పై పోరాడే రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచేందుకు ఇవి బాగా ఉప‌యోగ‌ప‌డతాయ‌ని చెబుతారు.

గాడిద పాల బ్రీడింగ్ చేసిన త‌ర్వాత డైరీ ప‌నులు ప్రారంభిస్తార‌ని జాతీయ గుర్రాల ప‌రిశోధ‌న కేంద్రం పేర్కొంది. కాగా ఈ గాడిద పాల ధ‌ర గుజ‌రాత్‌లో రూ. 7వేలు ఉంటే..ఈ డైరీలో ఎంత ఫిక్స్ చేస్తారో ఇంకా చెప్ప‌లేదు. ఏదిఏమైనా ఆవుపాలు, గేదె పాల లాగా ఇక నుంచి గాడిద పాలు కూడా బాగా ప్రాచుర్యంలోకి వ‌స్తాయ‌నిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here