మాట నిల‌బెట్టుకున్న ముఖ్య‌మంత్రి

జ‌గ‌న్ అన్న ఇచ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటాన‌ని కొత్త ఎమ్మెల్సీ జ‌కియా ఖానం అన్నారు. గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఈమె నూత‌నంగా ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆరేళ్ల పాటు ఈమె ఎమ్మెల్సీ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు. దీంతో త‌న ఎంపిక‌కు కృషి చేసిన అంద‌రికీ ఆమె కృత‌జ్ఞ‌తలు తెలిపారు.

ఎమ్మెల్సీగా ఎన్నికైన అనంత‌రం జ‌కియా ఖానం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లిశారు. మీరు ఇచ్చిన అవ‌కాశాన్ని రాయ‌చోటి అభివృద్ధి కోసం కృషి చేస్తాన‌ని ఆమె తెలిపారు. సామాన్య కుటుంబం నుంచి వ‌చ్చిన త‌న‌కు ఎమ్మెల్సీగా అవ‌కావం ఇవ్వ‌డం ప‌ట్ల సంతోషం వ్యక్తం చేశారు. త‌న‌కు ఈ అవ‌కాశం వ‌చ్చేందుకు కృషి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీ‌కాంత్ రెడ్డిల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

వై.ఎస్ జ‌గ‌న్ మైనార్టీల‌కు ఎంతో ప్రాధాన్య‌త ఇస్తున్నార‌ని జ‌కియా ఖానం అన్నారు. మ‌హిళా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం త‌న వంతు కృషి చేస్తాన‌న్నారు. మైనార్టీ మ‌హిళ‌కు ఎమ్మెల్సీగా అవ‌కాశం ఇవ్వ‌డం ఆనందంగా ఉంద‌ని ప్ర‌భుత్వ చీప్ విఫ్ గ‌డికోట శ్రీ‌కాంత్ రెడ్డి అన్నారు. ముఖ్య‌మంత్రి ఇచ్చిన మాట‌ను ఎప్పుడూ త‌ప్ప‌ర‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here