బాలు కోసం సల్లూభాయ్ ఎమోషనల్ ట్వీట్..!

https://twitter.com/BeingSalmanKhan/status/1309186064595083264కరోనా బారిన పడిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం గత కొన్ని రోజులుగా చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే కొన్ని రోజుల క్రితం.. ‘బాలు కరోనాను జయించాడు, చికిత్సకు సహకరిస్తున్నారని, త్వరలోనే పూర్తిగా కోలుకుంటారని’ వచ్చిన వార్తలు ఆయన అభిమానుల్లో సంతోషాన్ని నింపాయి. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలు అందరిని తీవ్ర ఆవేదనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఆసుపత్రి వర్గాలు విడుదల చేసిన బులెటిన్ ప్రకారం బాలు ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని తెలిసింది.

దీంతో ఆయన అభిమానులతో పాటు సెలబ్రిటీలు కూడా బాలు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ట్విట్టర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్ట్ చేశాడు. ‘మీరు నా కోసం పాడిన ప్రతి పాటకి ధన్యవాదాలు సార్…మీరు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అంటూ సల్మాన్ ట్వీట్ చేశారు. ఇదిలా ఉంటే 1990లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన పలు చిత్రాల్లో బాలు పాడిన పాటలు ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. కుటుంబ సభ్యుల, అశేషమైన అభిమానుల ప్రార్థనలు ఫలించి బాలు కోలుకోవాలని మనమూ ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here