పెళ్లయిన రెండు వారాలకే.. భర్తను వద్దంటున్న నటి.!

పూనమ్ పాండే.. ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లో నిలవడం ఈ బ్యూటీకి అలవాటు. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతి పోగొడుతుందీ హాట్ యాక్ట్రస్. ఇదిలా ఉంటే పూనమ్ పాండే తాజాగా తన స్నేహితుడైన సామ్ బాంబేను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే పెళ్లి జరిగి పట్టుమని రెండు వారాలు కూడా కాకముందే… తన భర్త వేధిస్తున్నాడంటూ పూనమ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ఓ సినిమా షూటింగ్‌ కోసం గోవా వెళ్లిన పూనమ్‌ తన భర్త వేధిస్తున్నాడని, శారీరక దాడికి పాల్పడుతున్నాడని సామ్‌పై గోవా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై పూనమ్..  మాట్లాడుతూ..  ‘సామ్‌తో  నా బంధం ఎప్పుడూ హింసాత్మకంగానే ఉండేది. పెళ్లి చేసుకుంటే అతనిలో మార్పు వస్తుందని భావించాను. నాపై ఆధిపత్యం చలాయించడమే కాకుండా చిన్న విషయాలకే ఆవేశపడుతుంటాడు. గోవాలో చిన్న విషయంలో ఇద్దరికీ వాదన మొదలైంది. దాంతో నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. ముఖంపై పిడికిలితో గుద్దాడు.  జుట్టు పట్టుకొని ఈడ్చుకుంటూ లాక్కెళ్లి తలను మంచం మూలకేసి కొట్టాడు. ఆ సమయంలో ప్రాణం పోయిందేమో అనుకున్నా. ఏదోలా బయటపడ్డా. హోటల్‌ సిబ్బంది సహాయంతో పోలీసులు అతన్ని అరెస్ట్‌ చేశారు. జంతువులా ప్రవర్తించిన ఆ భర్త నాకు వద్దు. మా ఇద్దరి మధ్య ఉన్న బంధాన్ని కాపాడుకోవడానికి ఎంతో ప్రయత్నించాను. కాని ఇలాంటి వ్యక్తితో ఉండడం కంటే ఒంటరిగా ఉండడం మేలు’ అని పూనమ్‌ తన ఆవేదనను చెప్పుకొచ్చింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here