మంత్రి కొడాలి చేసిన వ్యాఖ్య‌ల‌పై క్లారిటీ ఇచ్చిన ప్ర‌భుత్వ స‌ల‌హాదారు..

ప్ర‌ధాని మోదీపై ఏపీ మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర దుమారం రేపిన విష‌యం తెలిసిందే. దీనిపై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడారు. కొడాలి నాని చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మన్నారు.

కొడాలి నాని వ్యాఖ్య‌ల ప‌ట్ల వైసీపీ ప్ర‌భుత్వం ఏ విధంగా స్పందిస్తుందో అన్న అనుమానం అంద‌రిలోనూ ఉండేది. ఎందుకంటే ఇప్ప‌టికే బీజేపీ, వైసీపీ మ‌ధ్య కేంద్రంలో మంచి సంబంధాలు ఉన్నాయి. జ‌గ‌న్ ప‌రిపాల‌న‌పై మోదీ కూడా సంతృప్తితో ఉన్నారు. ఈ విష‌యం ఇటీవ‌ల జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్సులో బ‌య‌ట‌పడిన విష‌యం తెలిసిందే. మ‌రి ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏపీ మంత్రి.. ప్ర‌ధానిపై చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చర్చ‌నీయాంశ‌మ‌య్యాయ‌ని చెప్పొచ్చు.

ఈ ప‌రిస్థితుల్లో ప్ర‌భుత్వానికి చెడ్డ‌పేరు వ‌స్తుందా అన్న ఆందోళ‌న చాలా మందిలో ఉండేది. దీనిపై ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్ర‌ధానిపై ఇలా వ్యాఖ్య‌లు చేయ‌డం స‌రికాద‌న్నారు. నాని చేసిన వ్యాఖ్యాలు ఆయ‌న వ్య‌క్తిగ‌త‌మైన‌వ‌న్నారు. అయితే ఆయ‌న ఏ సంద‌ర్బంలో ఆ వ్యాఖ్య‌లు చేశారో త‌న‌కు తెలియ‌ద‌న్నారు. ఆ వ్యాఖ్య‌ల ప‌ట్ల కొడాలి కూడా వాస్త‌వాన్ని తెలుసుకొని ఉంటార‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. నేతలు సంయ‌మ‌నం పాటించాల‌న్నారు. మ‌రి ఈ వివాదం ఇంత‌టితో స‌మిసిపోతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here