పరీక్షకు హాజరైన సాయి పల్లవి..

ప్రేమమ్ సినిమాతో ఒక్కసారి అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంది అందాల తార సాయి పల్లవి. ఇక ‘ఫిదా’ చిత్రంలో భానుమతిగా తెలుగు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందీ బ్యూటీ. కెరీర్ తొలినాళ్ల నుంచీ గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ.. అందానికి సరికొత్త అర్థం చెబుతూ, తనదైన సహజ నటనతో ప్రేక్షకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. తన పాత్రకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలనే ఎంచుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటుంది. ఈ చిన్నదాని నటనకు ఎన్నో అవార్డులు దాసోహం అయ్యాయి. ఇక సినిమాల్లోకి రాకముందు సాయిపల్లవి మెడిసిన్ కోర్సు చేసిన విషయం తెలిసిందే.

జార్జియాలోని టిబిలిసి స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో మెడిసిన్ డిగ్రీ పూర్తి చేసింది సాయి. భారతదేశంలో మెడిసిన్ ప్రాక్టీస్ చేయడానికి సంబంధించిన ఓ పరీక్షకు తాజాగా హాజరైందీ చిన్నది. ఇటీవల తిరుచ్చి ఎంఎఎం కాలేజీలో జరిగిన పరీక్షకు మాస్కు, స్కార్ఫ్ ధరించి హాజరైంది. సాయి పల్లవిని గుర్తుపట్టిన అక్కడి అభిమానులు.. తనతో సెల్ఫీలు తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు తనకెంతో ఇష్టమైన వైద్య వృత్తిని కొనసాగిస్తున్న సాయిపల్లవి నిజంగా గ్రేట్ కదూ. ఇక సినిమాల విషయానికొస్తే సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో ‘లవ్ స్టోరీ’, రానా హీరోగా తెరకెక్కుతోన్న ‘విరాట పర్వం’లో నటిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here