కీర్తి ‘మిస్ ఇండియా’ కూడా ఓటీటీ లోనే.. !

కరోనా వైరస్ కారణంగా కుదేలైన రంగాల్లో సినీ పరిశ్రమ కూడా ఒకటి. లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూత పడటంతో సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తోంది.  నెలలు గడుస్తున్నా థియేటర్లు ఓపెన్ కాకపోవడంతో కొంతమంది నిర్మాతలు ఓటీటీలవైపు మొగ్గు చూపారు. ఎన్నడూ లేని విధంగా సినిమాలను నేరుగా ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో విడుదల చేసి సరికొత్త సంప్రదాయానికి నాంది పలికారు. ఈ వరుసలో కి వస్తుంది కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన ‘పెంగ్విన్’ చిత్రం. ఓ మోస్తరు బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను ఆన్ లైన్ లో విడుదల చేయడంతో..  మరికొన్ని చిత్రాలకు ధైర్యాన్నిచ్చింది.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన మరో సినిమా ‘మిస్ ఇండియా’ను కూడా ఆన్ లైన్ లోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం. దసరా కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు టాక్. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎదురు చూడాల్సిందే. మహేష్ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంతో నరేంద్రనాథ్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here