మరో మంచి అవకాశం సొంతం చేసుకున్న మెహర్ రమేష్..!

బడా హీరోలతో సినిమాలు చేసినా ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేక పోయాడు దర్శకుడు మెహర్ రమేష్. కంత్రి, బిల్లా, శక్తి, షాడో.. లాంటి భారీ బడ్జెట్ చిత్రాలను తెరకెక్కించినా ఒక్క విజయాన్ని కూడా అందుకోలేకపోయాడు. 2013లో వెంకటేష్ హీరోగా నటించిన ‘షాడో’నే రమేష్ చివరి సినిమా. అయితే ఇక  కెరీర్ ముగిసిపోతోంది అనుకుంటున్న సమయంలో  మెహర్ భారీ అవకాశాన్ని కొట్టేశాడు. ఈసారి మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ స్వయంగా తెలపడం విశేషం.

తాజాగా పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకొని మెహర్ రమేష్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ కు స్పందించిన పవన్… ‘ థాంక్యూ రమేష్. చిరంజీవి గారితో మీరు చేయబోయే సినిమాకు ఆల్ ది బెస్ట్’ అంటూ రిప్లై ఇచ్చాడు. దీంతో మెహర్, చిరుల కాంబినేషన్ లో సినిమా కన్ఫామ్ అయ్యింది. తమిళ్ లో తెరకెక్కిన వేదాళం రీమేక్ లో చిరు నటించనున్నట్లు, ఈ చిత్రాన్ని దర్శకుడు మెహర్ రమేష్ తెరకెక్కించనున్నారని గతంలో వార్తలు వచ్చాయి.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here