మళ్లీ ‘గబ్బర్ సింగ్’ కాంబినేషన్… ఈసారి వినోదం మాత్రమే కాదు.

‘ఖుషీ’ తర్వాత సుమారు 11 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ  తర్వాత పవన్ కళ్యాణ్ కు సాలిడ్ విజయాన్ని అందించాడు దర్శకుడు హరీష్ శంకర్. తమ అభిమాన హీరో విజయం కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూసిన ఆయన అభిమానులకు వీనుల విందు చేసింది ‘గబ్బర్ సింగ్’ చిత్రం. మళ్లీ తొమ్మిదేళ్ల తర్వాత ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా రానుంది. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా పవన్ కళ్యాణ్ 28వ చిత్రానికి సంబంధించిన కాన్సెప్ట్ ఫోటోను మైత్రి మూవీ మేకర్స్ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది.

ఇంకా టైటిల్ ఖరారు చేయని సినిమా కాన్సెప్ట్ పోస్టర్ చాలా ఆసక్తిగా ఉంది. వెనుక ఇండియా గేట్.. దాని ముందు ఖరీదైన ఓ బైక్..  దానిపై పెద్దబాలశిక్ష, గులాబీ  పువ్వును ఉంచారు. అంతేకాదు, ఇండియా గేట్‌పై సర్దార్ వల్లభాయ్ పటేల్, సుభాష్ చంద్రబోస్ ఫొటోలు కూడా ఉంచారు. ఇక ఈ కాన్సెప్ట్ ఫొటోతో పాటు  ‘‘ఈసారి కేవలం ఎంటర్‌టైన్మెంట్ మాత్రమే కాదు’’ అనే క్యాప్షన్ ను జోడించారు.దీనిబట్టి చూస్తుంటే ఈ సినిమాలో  వినోదంతో పాటు మంచి సందేశం కూడా ఉండనున్నట్లు అర్థమవుతోంది.

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here