లక్కీ ఛాన్స్ కొట్టేసిన ప్రియా ప్రకాశ్..?

ఒక చిన్న కన్నుగీటి ఒక్కసారి దేశం దృష్టిని తనవైపు తిప్పుకుంది మలయాళీ ముద్దుగుమ్మ ప్రియాప్రకాశ్ వారియర్. ‘ఒరు ఆడార్ లవ్’ (లవర్స్ డే) చిత్రంతో వెండితెరకు పరిచయమైందీ చిన్నది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించక పోయినప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ గా మారిన కన్నుకొట్టిన వీడియో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాందించుంది. ఇప్పటివరకు ఒక్క పెద్ద చిత్రంలోనూ నటించని ప్రియా తాజాగా ఓ స్టార్ హీరో త‌న‌యుడితో జ‌త క‌ట్ట‌నున్న‌ట్లుతెలుస్తోంది.

హీరో విక్ర‌మ్ కుమారుడు ధృవ్ క‌థానాయకుడిగా మురుగ‌దాస్ శిష్యుడు ర‌వికాంత్ ద‌ర్శ‌క‌త్వంలో తెరకెక్కనున్న చిత్రంలో  ప్రియాప్ర‌కాశ్ వారియ‌ర్‌ను ఎంపిక చేశార‌ని వినికిడి. దీనిపై త్వ‌ర‌లోనే  అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డే అవ‌కాశం ఉన్నట్లు టాక్. ఇదిలా ఉంటే  తెలుగులో నితిన్‌, చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా ప్రియా ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here