మరో చైనా యాప్ ను నిషేధించిన కేంద్రం..

గల్వాన్ లోయలో భారత సైనికులపై చైనా ఆర్మీ జరిపిన దాడుల అనంతరం భారత్, చైనాల మధ్య సంబంధాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాను  దెబ్బకొట్టడానికి భారత ప్రభుత్వం టిక్ టాక్ తో పాటు పలు చైనా యాప్ లపై నిషేధం విధించింది. ఇదిలా ఉంటే తాజాగా మరో చైనా యాప్ ను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. పబ్జీ సహా 118 చైనా యాప్‌లను బ్యాన్ చేస్తున్నట్లు బుధవారం కేంద్రం ప్రకటించింది. పిల్లల్లో నేరప్రవృత్తి పెంచేలా పబ్జీ గేమ్‌ ఉండటంతో ఈ యాప్‌ను ప్రభుత్వం నిషేధించింది. ప్రభుత్వ నిర్ణయంతో గూగుల్‌, యాపిల్‌ ప్లేసోర్ట నుంచి పబ్జీని తొలగించారు.

ఇక పబ్జీ గేమ్ కు బానిసలుగా మారి కొంతమంది యువకులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు వెలుగు చూసిన విషయం తెలిసిందే. ప్రాణాలతో చలగాటమాడుతోన్న ఈ గేమ్ ను తొలగించాలని విజ్ఞప్తులు వచ్చిన నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here