మోదీ ట్విట్టర్ పై హ్యాకర్ల దాడి.. 

ప్రధాని నరేంద్ర మోదీ పర్సనల్ ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని స్వయంగా ట్విట్టర్ ప్రతినిధులు ధృవీకరించారు. మోదీ అకౌంట్ ను హ్యాక్ చేసిన దుండగులు… కోవిడ్ 19 నేపథ్యంలో పీఎం నేషనల్ ఫండ్ ద్వారా క్రిప్టో కరెన్సీ రూపంలో విరాళాలు ఇవ్వాలని ప్రధాని కోరినట్లుగా నేరగాళ్లు వరుస ట్వీట్లు చేశారు. ఈ తెల్లవారుజామున మోదీ అకౌంట్ హ్యాక్ అయినట్లు గుర్తించారు.

ఈ సంఘటనపై ట్విట్టర్ సంస్థ ప్రతినిధి మాట్లాడుతూ.. హ్యాకింగ్ గురించి తెలుసుకున్నామని, అకౌంట్ ను మళ్లీ సెక్యూర్ చేశామని, ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు చేపడతామని తెలిపారు. ప్రధాని ట్విట్టర్ అకౌంట్ కు  ఇప్పటివరకు సుమారు 2.5 మిలియన్ల మంది ఫాలోవర్లున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here