‘ఆది పురుష్’లో విలన్ ఎవరో తెలుసా..?

యంగ్ రెబల్ స్టార్ హీరోగా బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ‘ఆది పురుష్’ అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అత్యంత భారీ బడ్జెట్ తో  నిర్మించనున్న ఈ సినిమా పౌరాణిక నేపథ్యంలో రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవలే ప్రభాస్ ఫస్ట్ లుక్ కు  సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. అయితే తాజాగా సినిమాలో విలన్ పాత్ర.. అంటే రావణుడు ఎవరు అనే విషయం తెలిసింది. ఈ సినిమాలో రావణుడి పాత్ర లో బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. విలన్ పాత్రను లంకేష్ గా పరిచయం చేస్తూ ప్రత్యేక పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇక ఈ ఫోటోను షేర్ చేసిన ప్రభాస్.. ‘ ఏడు వేల సంవత్సరాల క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు’ అనే క్యాప్షన్ ను రాసుకొచ్చారు.

ఈ చిత్రాన్ని టీ సిరీస్ బ్యానర్ పై భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళ, మలయాళ, కన్నడతో సహా పలు భాషల్లో విడుదల చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రభాస్ సరసన సీత పాత్రలో కీర్తి సురేష్ నటించనున్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here