బన్నీకి చెల్లిగా నటించనున్న సాయి పల్లవి.? 

కెరీర్ తొలినాళ్ల నుంచి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంది నటి సాయి పల్లవి. గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూ వస్తోన్న సాయి పల్లవి తన పాత్రకు సినిమాలో ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది. ఈ అమ్మడు ఇప్పటివరకు ఎంచుకున్న పాత్రలే దీనికి నిదర్శనం. ఇదిలా ఉంటే ప్రస్తుతం విరాట పర్వం చిత్రంలో నటిస్తోన్న సాయి పల్లవి, తర్వాత ‘పుష్ప’ చిత్రంలో నటించనున్నట్లు తెలుస్తోంది.

సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అల్లు అర్జున్, రష్మిక హీరోహీరోయిన్లుగా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో సాయి పల్లవి బన్నీకి చెల్లెలుగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఒక యంగ్ హీరోయిన్ అందులోనూ యంగ్ హీరోకు చెల్లిగా నటించడానికి ఒప్పుకోవడం నిజంగానే ధైర్యమనే చెప్పాలి. అయితే సాయి పల్లవి పాత్రకు ఈ సినిమాలో అధిక ప్రాధాన్యత ఉండడం, దర్శకుడు సుకుమార్ చెప్పిన కథ నచ్చడంతో సాయి పల్లవి ఓకే చెప్పినట్లు సమాచారం. ఇక చిరంజీవి సినిమాలోనూ  కూడా సాయి పల్లవి నటించనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here