తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న దూకుడు..

సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో దూకుడు చిత్రానికి ఉన్న ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సైనికుడు, అతిథి, ఖలేజా వంటి వరుస పరాజయాల తర్వాత దూకుడు చిత్రం మహేష్ బాబు కెరీర్ కు మంచి బూస్ట్ నిచ్చింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా కమర్షియల్ అంశాలతో కూడిన కామెడీ చిత్రాలలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచి,  బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని నమోదు చేసింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలైన ఈ చిత్రం నేటితో (బుధవారం) తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా సోషల్ మీడియా ద్వారా ఈ చిత్రాన్ని శ్రీనువైట్ల గుర్తు చేసుకున్నారు.

దూకుడు షూటింగ్ స్పాట్ లో మహేష్ బాబుతో కలిసి దిగిన ఫోటోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శ్రీను వైట్ల.. ‘షూటింగ్ సమయంలోనూ, ఆ తర్వాత `దూకుడు` సినిమా ఎన్నో సంతోషకర అనుభవాలను మిగిల్చింది. నా కెరీర్‌లో `దూకుడు` ఓ మైలురాయి. మర్చిపోలేని అనుభవాన్ని అందించిన మహేష్‌కు ధన్యవాదాలు. ఈ చిత్రానికి పనిచేసిన అందరికీ కృతజ్ఞతల`ని శ్రీనువైట్ల ట్వీట్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here