అమ్మాయి బాగా నచ్చితే ఆలోచిస్తా..!

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లో మెగా హీరో సాయి ధరమ్‌తేజ్‌ ఒకరు. ఇటీవల తేజ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఈ యంగ్‌ హీరో పెళ్లి ఎప్పుడనే చర్చ మొదలైంది. తేజ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి చేసిన.. ‘నీకు త్వరలోనే సోలో డేస్‌ ముగిసిపోనున్నాయి. ఇప్పుడే ఎంజాయ్ చేయు’ అనే ట్వీట్‌తో సాయి ధరమ్‌ తేజ్‌ వివాహంపై చర్చ మొదలైంది. త్వరలోనే ఈ మెగా హీరో పెళ్లి పీటలెక్కనున్నాడని వార్తలు వచ్చాయి. అయితే సాయితేజ్‌కు మాత్రం పెళ్లంటే పెద్దగా ఆసక్తి లేదని చెప్పాడు.

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఇంట్లో వాళ్లు నాకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. వాళ్లు ఒత్తిడి చేస్తుంటే, సంబంధాలు చూడమని మాత్రం చెప్పాను. అంతకుమించి నా పెళ్లిపై ఏదీ ముందుకు జరగలేదు. ప్రస్తుతానికైతే పెళ్లిపై పెద్దగా ఆలోచన లేదు. అమ్మాయి బాగా నచ్చితే అప్పుడు ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చాడీ యంగ్‌ హీరో.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here