అత్తారింట్లో రానా పండుగ సందడి..

బ్యాచిలర్‌ జీవితానికి గుడ్‌బై చెబుతూ నటుడు రానా తన స్నేహితురాలు, ప్రేయసి మిహీకా బజాజ్‌ను లాక్‌డౌన్‌ సమయంలో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా అత్యంత సన్నిహితుల నడుమ రామానాయుడు ఫిలిం స్టూడియోలో ఈ జంట వివాహ బంధంతో ఒక్కటైంది. ఇక వివాహం తర్వాత కొన్ని రోజులు ఇంటికే పరిమితమైన ఈ జంట ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. కొవిడ్‌ నిబంధనల సడలింపులకు అనుగుణంగా ఇటీవల రానా, మిహీకా విహార యాత్రకు వెళ్లారు. ఈ టూర్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ హల్‌చల్‌ చేశాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈ జంట దసరా పండుగను ఎంతో ఆనందంగా జరుపుకుంది. వివాహం తర్వాత వచ్చిన తొలి దసరాను రానా తన అత్తవారింట్లో జరుపుకున్నారు. ఈ సందర్భంగా మిహీకాతో పాటు అత్త, మామలు కలిసి దిగిన ఫొటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను రానా అత్తయ్య బంటీ బజాజ్‌ ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా పోస్ట్‌ చేస్తూ.. ‘హ్యాపీ దసరా’ అనే క్యాప్షన్‌ను జోడించారు. ఇందులో రానా, మిహీకా జంట చూడముచ్చటగా కనిపిస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here