మరో అరుదైన ఘనత సాధించిన సమంత..

ప్రస్తుతం సినిమా సెలబ్రిటీల క్రేజీ సోషల్‌ మీడియాలో వారి ఫాలోవర్ల సంఖ్య ఆధారంగానే లెక్కగడుతున్నారు. ఎవరికి ఎక్కువ ఫాలోవర్లు ఉంటే వాళ్లకి ఎక్కువ క్రేజ్‌ ఉన్నట్లు లెక్క. అంతేకాదు సెలబ్రిటీలు సోషల్‌ మీడియాలో బ్రాండ్‌లకు సంబంధించి చేసే పోస్టింగ్‌లకు రెమ్యునరేషన్‌ కూడా ఫాలోవర్ల సంఖ్యపైనే ఆధారపడి ఉంటుంది. తాజాగా నటి సమంత ఫాలోవర్ల విషయంలో అరుదైన ఘనతను సాధించింది.

 

ఇన్‌స్టాగ్రామ్‌లో అక్కినేని వారి కోడలి ఫాలోవర్ల సంఖ్య ఏకంగా 13 మిలియన్లు (1.30 కోట్లు) చేరుకుంది. ఈ విషయాన్ని సమంత స్వయంగా తెలియజేస్తూ ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ చేసింది. తెలుపు రంగు ప్రింట్‌ డ్రస్‌లో దిగిన అందమైన ఫొటోను పోస్ట్‌ చేసిన ఈ చిన్నది ఫాలోవర్లకు సంబధించిన విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అలాగే అభిమానులకు ‘హగ్‌ అండ్‌ కిస్‌’ అంటూ క్యాప్షన్‌ను జోడించింది. వివాహం తర్వాత కూడా వరుస సినిమాలకు సైన్ చేస్తూ తనదైన శైలిలో దూసుకెళుతోందీ బ్యూటీ. కెరీర్‌ విషయానికొస్తే.. సమంత ఇటీవల నటించిన ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రానున్న చిత్రంలో సమంత హీరోయిన్‌గా నటించనుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

https://www.instagram.com/p/CGuQ9WuhqIB/?utm_source=ig_web_copy_link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here