సచిన్ ది సినిమా కాదు ? డాక్యుమెంటరీ ?

భారత క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ జీవితం మీద సినిమా అనగానే అందరూ చాలా ఉత్సాహ పడ్డారు. కాస్త లేట్ అయినా కూడా మొత్తం మీద సచిన్ ట్రైలర్ ని నిన్న విడుదల చేసారు .. ఈ ట్రైలర్ అడిరిపోవడం తో ఆయన ఫాన్స్ సంతోషానికి ఇక అవధులు అనేవి లేకుండా పోయాయి. అభిమానులలో ఒక రకమైన ఎమోషన్ ని తీసుకొచ్చింది ఈ ట్రైలర్. క్రికెట్ దేవుడిగా సచిన్ ని కొలిచే ఈ దేశం లో ఇంతకంటే బెస్ట్ ట్రైలర్ ఏముంటుంది ? ఈ ట్రైలర్ చూస్తే గూస్ బంప్స్ రావడం ఖాయం. ఈ సినిమా ట్రైలర్ చూస్తే మాత్రం ఇది ట్రైలర్ కంటే ఎక్కువ డాక్యుమెంటరీ లాగా తీసారు.

డైరెక్టర్ జేమ్స్ మొదటి నుంచీ డాక్యుమెంటరీ లూ , బయో పిక్ లూ తీయడం లో సిద్ద హస్తుడు . అతన్ని ఎంచుకున్న సచిన్ తన సినిమా చాలా కొత్తగా ఉండాలని కోరాడట. ధోని సినిమాలాగో.. మిల్కాసింగ్ సినిమాలాగో రెగ్యులర్ బయోపిక్స్ ఫార్మాట్లో తీయాలంటే మన డైరెక్టర్లనే ఆశ్రయించేవారు. కానీ దీన్ని భిన్నంగా తీయాలని అతణ్ని డైరెక్టర్‌గా పెట్టుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here