ర‌ష్యా టీకాపై అనుమానాలు.. అయినా భారీ పోటీ..

ప్ర‌పంచాన్ని గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్‌కు ర‌ష్యా టీకా క‌నిపెట్టిన విష‌యం తెలిసిందే. అయితే దీన్ని బుక్ చేసుకునేందుకు డిమాండ్ పెరుగుతుంటే.. మ‌రోవైపు ప‌లు అంత‌ర్జాతీయ నిపుణులు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు.

క‌రోనా వ్యాక్సిన్‌కు ర‌ష్యా స్పుత్నిక్ వి అని నామ‌క‌ర‌ణం చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ కోసం ఇప్ప‌టివ‌ర‌కు 20 దేశాలు ముందుగా బుక్ చేసుకున్నాయి. కాగా ఈ వ్యాక్సిన్ మూడో ద‌శ ట్ర‌య‌ల్స్ ప్రారంభ‌మ‌య్యాయి. వ్యాక్సిన్ ఉత్ప‌త్తిని మాత్రం సెప్టెంబ‌రు నుంచి ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. విదేశా భాగ‌స్వామ్యుల‌తో క‌లిసి సంవ‌త్స‌రానికి 500 మిలియ‌న్ డోసుల వ్యాక్సిన్‌ను ఉత్ప‌త్తి చేయ‌నున్నారు.

ర‌ష్యా టీకా తొలి బ్యాచ్ మ‌రో రెండు వారాల్లో బ‌య‌ట‌కు రానుంది. దీన్ని వేసిన వారి ఆరోగ్య ప‌రిస్థితిని ప‌రీక్షించేందుకు ర‌ష్యా ప్ర‌త్యేకంగా చ‌ర్య‌లు తీసుకోనుంది. దీనికోసం ఒక యాప్‌ను సిద్ధం చేశారు. వైద్య సిబ్బందితో పాటు ఎవ‌రైనా మొద‌ట‌గా టీకా వేసుకోవ‌చ్చ‌ని ఆ దేశం వెల్ల‌డించింది. ర‌ష్యా అవ‌స‌రాలు తీర్చేందుకే ముందుగా టీకాను ఉప‌యోగిస్తామ‌ని ప్ర‌క‌టించింది.

ఇక ర‌ష్యా వ్యాక్సిన్‌పై అంత‌ర్జాతీయ నిపుణులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. కేవ‌లం రెండు నెల‌ల ప్ర‌యోగాల త‌ర్వాత వ్యాక్సిన్‌ను ఆమోదించార‌ని.. అదీ కాకుండా ప‌రీక్ష‌ల ఫ‌లితాలు ఎక్క‌డా వెల్ల‌డించ‌లేద‌ని చెబుతున్నారు. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో వ్యాక్సిన్ న‌మ్మ‌డం క‌ష్టంగా ఉంద‌ని జ‌ర్మ‌నీ , బ్రిట‌న్ దేశాలు అంటున్నాయి. అసంపూర్తిగా చేసిన ప‌రీక్ష‌ల వ‌ల్ల ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here