రేణూ దేశాయ్ ఇలా చేసిందా.. మ‌రి ఫ్యాన్స్ ఏమ‌న్నారు

సినీ న‌టి రేణూ దేశాయ్ త‌న రెండు కార్ల‌ను అమ్మేశారు. దీంతో ఆమె ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నార‌ని అనుకుంటే పొర‌పడిన‌ట్లే ఆమె త‌న రెండు కార్ల‌ను అమ్మేసింది ఆమె కోసం కాదు.. స‌మాజం కోసం..

రేణూ దేశాయ్‌కి ఆడీ ఏ6, పోర్షే బాక్స‌ర్ కార్లు ఉన్నాయి. ఆడీ ఏ6 ప్రస్తుత ధ‌ర రూ. 54.2 ల‌క్ష‌లు ఉంది. ఇక పోర్షే బాక్స‌ర్ 80 ల‌క్ష‌ల రూపాయ‌ల దాకా ధర ఉంది. అయితే రేణూ ఈ రెండు కార్ల‌ను అమ్మేశారు. వాతావ‌ర‌ణ కాలుష్యాన్ని తగ్గించాల‌న్న ఉద్దేశంతోనే ఈ కార్ల‌ను అమ్మేశారు. ఈ విష‌యాన్ని రేణూ దేశాయ్ సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించారు.

పెట్రోల్‌‌, డీజిల్ తో న‌డిచే వాహ‌నాల వినియోగాన్ని త‌గ్గించాల‌న్న ఉద్దేశంతోనే ఇలా చేశాన‌ని చెప్పారు.
పెట్రోల్‌, డీజిల్ వాడ‌కాన్ని త‌గ్గించేందుకు అంద‌రూ కృషి చేయాల‌ని ఆమె పిలుపునిచ్చారు. త‌న అమ్మిన కార్ల స్థానంలో ఈ-ఎలక్ట్రిక్ హ్యుండాయ్ కారును కొన్న‌ట్లు చెప్పారు. ఇంధ‌నాల‌తో న‌డిచే వాహ‌నాల వ‌ల్ల భూమి మీద ఉండే జీవుల‌కు క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. రేణూ ఇచ్చిన ఈ సందేశంతో నెజిట‌న్లు హ్యాట్సాఫ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here