రాయ‌చోటిలో కోవిడ్ కేర్ సెంట‌ర్ ప్రారంభం..

క‌డ‌ప జిల్లా రాయచోటి శివారులో 300 పడకల కోవిడ్ కేర్ సెంటర్‌ను చీఫ్‌‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి, ఎమ్మెల్సీ జకీయా ఖానంలు ప్రారంభించారు. క‌రోనాతో ఎవ్వ‌రూ భ‌య‌పడాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు శ్రీకాంత్ రెడ్డి.

సీఎం వై.ఎస్ జ‌గ‌న్ ప్ర‌తి ఒక్క ప‌నిని క్షేత్ర స్థాయి నుంచి ఆలోచిస్తార‌న్నారు. అందులో భాగంగానే కోవిడ్ కేర్ సెంట‌ర్లో ఆహారం మెనూ ప్ర‌కారం అంద‌జేస్తున్న‌ట్లు చెప్పారు. ద‌గ్గు, జ‌లుబు, జ్వ‌రం ఏవిధంగా వ‌స్తుందో క‌రోనా కూడా అదేవిధంగా వ‌చ్చి న‌య‌మ‌వుతుంద‌న్నారు.

ఇక ప్ర‌తి మ‌నిషికి మ‌నోధైర్యం ఇచ్చేందుకు సీఎం ఎప్పుడూ ఆలోచిస్తుంటార‌న్నారు. క‌రోనా ప్ర‌తి ఒక్క‌రికీ వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. రాష్ట్రంలోని 30వేల‌కు పైగా వైద్యుల పోస్టుల‌ను భ‌ర్తీ చేస్తున్న ఘ‌న‌త సీఎం జ‌గ‌న్‌కే ద‌క్కింద‌న్నారు. 13 మెడిక‌ల్ క‌ళాశాల‌ల‌ను త్వ‌ర‌లోనే ప్రారంభిస్తార‌న్నారు. ఇక ప్ర‌భుత్వ స‌ల‌హ‌లు, సూచ‌న‌లు పాటించాల‌న్నారు. అంద‌రూ త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ రోగ‌నిరోధ‌క శ‌క్తి పెంచుకోవాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here