రాజమౌళి పని రాక్షసుడు: ఎన్టీఆర్‌

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వ పనితీరు గురించి పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలను ఎంతో పర్ఫెక్షన్ గా తెరకెక్కించే రాజమౌళి.. ప్రతి సన్నివేశం అత్యద్భుతంగా ఉండేలా చూసుకుంటాడు. యావత్ భారతీయ సినిమా ఇండస్ట్రీ గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరైన రాజమౌళి పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా ఆయన అభిమానులతో పాటు, సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు అభినందనలు తెలిపారు. ఈ క్రమంలోనే ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ రాజమౌళికి ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ఓ వీడియోను విడుదల చేసింది.

సాధారణంగా ఎవరికైనా శుభాకాంక్షలు చెప్పేటప్పుడు.. వారిని పొగుడుతూ చెబుతుంటారు. కానీ ఆర్ఆర్ఆర్ టీం సభ్యులు మాత్రం రాజమౌళి పర్ఫెక్షన్ కోసం తమను ఎంతగా హింసిస్తాడో చెబుతూ రాజమౌళిపై పలు  ఆరోపణలు చేసిన వీడియోను పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ఎన్టీఆర్, రామ్ చరణ్ చేసిన వ్యాఖ్యలు ఆకట్టుకుంటున్నాయి. దర్శక రాక్షసుడు చంపేస్తున్నారంటూ ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.  ఒక్క షాట్ కు మూడుగంటలు.. అదీ జక్కన్న చెక్కుడు.. ఆయన ప‌ర్‌ఫెక్షన్‌తో మమ్మల్ని చావగొట్టేస్తున్నారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. రామ్ చరణ్ కూడా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు. ఇక వీరితో పాటు సంగీత దర్శకుడు కీరవాణి, సెంథిల్ కుమార్, ఇతర టెక్నీషియన్స్ కూడా రాజమౌళిపై పలు ఆరోపణలు చేశారు. వారు చేసిన ఆ కంప్లైంట్స్ ను మీరూ ఓసారి చూడండి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here