రీస్టార్ట్‌ వీడియోను కూడా ఎంత బాగా చెక్కాడో..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో.. ఆ మాటకొస్తే భారతీయ సినిమా ఇండస్ట్రీలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు దర్శకుడు రాజమౌళి. సినిమాలో సన్నివేశాలను బొమ్మను చెక్కినట్లు అద్భుతంగా చెక్కుతాడు కాబట్టే రాజమౌళిని జక్కన్న అని పిలుచుకుంటుంటారు. ప్రస్తుతం రాజమౌళి.. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ హీరోలుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ అనే సినిమాను తెరకెక్కిస్తోన్న విషయం తెలిసిందే. కరోనా కారణంగా గత కొన్ని నెలలుగా షూటింగ్‌ వాయిద పడ్డ ఈ చిత్ర నిర్మాణాన్ని సినిమా యూనిట్‌ తిరిగి ప్రారంభించింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్‌ ‘వీ ఆర్‌ఆర్‌ఆర్‌ బ్యాక్‌’ పేరుతో ఓ వీడియోను రూపొందించింది.

కొన్ని నెలలపాటు షూటింగ్‌ ప్రదేశానికి ఎవరూ వెళ్లకపోవడంతో ఆ ప్రదేశమంతా దుమ్ము పట్టింది. చిత్రీకరణ కోసం యూనిట్‌ సెట్‌ను శుభ్రం చేశారు. దీనంతటినీ ఓ అందమైన వీడియోగా రూపొందించారు జక్కన్న. రీస్టార్ట్‌ వీడియోను కూడా సినిమాలోని ఓ అందమైన సన్నివేశంగా చెక్కిన ఘనత రాజమౌళికే దక్కిందని చెప్పాలి. కరోనా తర్వాత షూటింగ్‌ను ఎలా మొదలు పెట్టామన్న ఈ విషయాన్ని వీడియోలో చాలా బాగా చూపించారు. ఇక వీడియోతో పాటు ఎన్టీఆర్‌ అభిమానులకు మరో తీపి కబురును అందించాడు రాజమౌళి.. అక్టోబర్‌ 22న దసరా కానుకగా ‘రామరాజు ఫర్‌ భీమ్‌’ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఆ వీడియోను మీరూ ఓసారి చూసేయండి. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్‌చరణ్‌, కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌ నటించనున్న విషయం తెలిసిందే.

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here