విడుదలకు ముందే రికార్డులు తిరగరాస్తున్న ‘ఆర్‌.ఆర్‌.ఆర్‌’..!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌ చరణ్‌ హీరోలుగా ఆర్‌.ఆర్‌.ఆర్‌ అనే సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న ఈసినిమాపై యావత్‌ భారతీయ సినిమా ఇండస్ట్రీ దృష్టి ఉందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు తగ్గట్లుగానే ఈ సినిమాలో బాలీవుడ్‌ తారలను కూడా నటింపజేస్తున్నారు. ప్యాన్‌ ఇండియా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఇటీవలే తిరిగి ప్రారంభమైన విషయం తెలిసిందే. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఈ సినిమా చిత్రీకరణ తాజాగా హైదరాబాద్‌లో మళ్లీ మొదలైంది.

ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ వార్త తెగ వైరల్‌గా మారింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ చిత్ర డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు ఏకంగా రూ.200 కోట్లు పలుకుతోందని తెలుస్తోంది. ఓ ప్రముఖ సంస్థ ఈ భారీ మొత్తాన్ని ఆఫర్‌ చేసినట్లు సమాచారం. ఇలా విడుదలకు ముందే రూ.200 కోట్లు బిజినెస్‌ చేస్తోన్న ఈ సినిమా విడుదల తర్వాత ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. అయితే ఈ విషయమై చిత్ర యూనిట్‌ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇక తెలుగులో అత్యధిక ధరకు డిజిటల్‌, శాటిలైట్‌ హక్కులు పొందిన సినిమాగా ‘సాహో’ ఉంది. ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ రైట్స్ దాదాపు రూ.150 కోట్లకు అమ్ముడయ్యాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here