సింహాలు లేకపోతే బాలయ్య సినిమాలో డైలాగులే ఉండవా ?

నందమూరి బాలకృష్ణ సినిమాలు ఎప్పుడు పవర్ ఫుల్ టైటిల్ తో మొదలు అయి,తోడ్డగోటడం,కుటుంబ చరిత్ర,ప్రత్యర్థులను ఇరగదీసే ఫైట్లు,సాంగ్స్ వంటి వాటితో ముడిపడి ఉంటాయి. ఇండస్ట్రీ లో ఒక టాక్ స్తూ ఉంటుంది ఎప్పుడూ .  హీరోల మిద సిట్టింగ్స్ గురుంచి చెబితే మహేశ్ మంచి కథ కి సినిమాకి ఒప్పుకుంటాడు అని ,మీ సినిమాలో గన్స్ ఎక్కువ ఉంటాయి అంటే పవన్ డేట్స్ ఇస్తారని అలాగే మీ సినిమాలోఅదిరిపోయే డైలాగులుఉంటాయి అంటే బాలయ్య ఒప్పుకుంటాడు అని అనేక మంది ఇండస్ట్రీలో చెప్పుకుంటారు.

ఇక ఆయనకు అలాంటి రొటీన్ సబ్జెక్ట్ తో కూడా   హిట్టు కొట్టడంతో .. ఆయనా దారిని వదిలే ప్రసక్తే లేదని తాజాగా విడుదలైన “జై సింహ” టిజర్  చూస్తేనే  అర్థమవుతుంది.కె.ఎస్.రవికుమార్ లాంటి మూలన పడి పోయిన దర్శకుడితో బాలకృష్ణ సినిమా చేస్తుండటమే ఒక పెద్ద వింత. ప్రస్తుతం విడుదలైన ఈ టీజర్లో బాలయ్య తెలుగు మామూలుగానే ఉంది. చివర్లో కత్తి  విసిరే గెటప్ మాత్రం కొత్తగా ఉంది.

విడుదలైన టీజర్ లో డైలాగ్స్ వింటే పాత రోత సినిమాలే  గుర్తు వస్తున్నాయి. మొత్తంమీద టీజర్లో కొత్తదనం మాత్రం ఏమీ లేదు . అసలు సింహాలు లేకపోతే బాలయ్య సినిమాలకి డైలాగులే ఉండవు ఏమో అంటూ ట్విట్టర్ లో ఛలోక్తులు కూడా పేలుతున్నాయ్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here