అత్తారింటికి మాది స్క్రీన్ ప్లే నే అజ్ఞాత వాసి కి కూడా ?

పవర్స్టార్ పవన్ కళ్యాణ్ మాటల మాంత్రికుడు  త్రివిక్రమ్ కలయికలో వస్తున్న అజ్ఞాతవాసి మీద  ప్రస్తుతం అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో అని , అటు సినీ ఇండస్ట్రీ  ఇటు మెగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటలు, టీజర్  బట్టి  సగటు ప్రేక్షకుడికి వచ్చి అనుమానం ఇది  .. ”అతరింటికి దారేది “సీక్వెల్ లాగా  ఉంది  ఏంటి అంటూ రెండు సినిమాల మధ్య పోలికలు కనిపిస్తున్నాయి అంటున్నారు .  కేవలం సినిమా కథ పరంగానే కాకుండా పాటల బట్టి కూడా ”అతరింటికి దారేది “ సినిమా గుర్తు వస్తోంది .

స్టోరీ పరంగాచాలా వ్యత్యాసాలు ఉన్న.స్క్రీన్ ప్లే మాత్రం అత్తారింటికి దారేది తరహాలోనే నడుస్తుంది అంటున్నారు చాలా మంది .అందులో ఎలాగైతే కామెడీ ఫ్యామిలీ,యాక్షన్,ఏమోషన్స్ తరహాలో సినిమా ను త్రివిక్రమ్ నడిపించినట్లు చిత్ర యూనిట్ చెబుతుంది. దీన్నిబట్టి సగటు ప్రేక్షకుడు అత్తారింటికి దారేది లా ఉంది అంటాడా లేకపోతే ,త్రివిక్రమ్ తన మాటలతో సన్నివేశాలతో మ్యాజిక్ చేస్తాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here