అబ్బే రజినీకాంత్ పార్టీ ఏమీ పెట్టట్లేదు ..

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అంటే గురించి అనేకమైన వార్తలు గుప్పు  మంటున్నాయి. ఇదిగో నేను త్వరలోనే పార్టీ పెట్టాస్తారు అంటూ ఒకరు లేదు బిజెపి కి సపోర్ట్ చేస్తాను అంటూ మరొకరు… తన పుట్టిన రోజునాడు స్పష్టమైన తన వైఖరి చెబుతారంటూ మరొకరు ఇలా ఎవరికి వారు  రజనీకాంత రాజకీయ అరంగ్రేటం గురించి చెప్పుకొస్తున్నారు. కానీ రజనీకాంత్ ఇప్పటివరకు రాజకీయ రంగ ప్రవేశంపై స్పష్టమైన ప్రకటన చేయలేదు. ఎవరైనా అడిగితే మాత్రం కాలంపైనా, దేవుడిపైనా నెపాన్ని నెట్టేస్తూ వాయిదా వేస్తూ వచ్చారు. అయితే ఈ క్రమంలో రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ పై ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు స్పష్టత ఇచ్చే దిశగా సాగుతోంది.

ఈ సందర్భంగా రజనీకాంత్ తన అభిమానులతో వరుసగా ఐదు రోజులు మాట్లాడడానికి  సమావేశాలు నిర్వహిస్తున్నారు. దాన్లో భాగంగా మొదటి రోజున చెన్నై లోని కోడంబ్కాకంలో ఉన్న రాఘ‌వేంద్ర క‌ల్యాణ మంట‌పంలో అభిమానుల స‌మావేశం నిర్వ‌హించారు. తిరువ‌ళ్లూరు, కాంచీపురం, ధ‌ర్మ‌పురి, కృష్ణ‌గిరి, నీల‌గిరి ప్రాంతాల‌కు చెందిన ఫ్యాన్స్ తో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో అంతర్గతంగా కొంత స్ప‌ష్ట‌త ఇచ్చే విధంగానే మాట్లాడారు.తన రాజకీయ రంగ ప్రవేశం సంబంధించి ఈనెల 31న స్పష్టమైన ప్రకటన వస్తుందని చెప్పారు.

ఇప్పటికే ఆలస్యం చేసినా దేవుడి దయ వుంటే తప్పకుండా రాజకీయ యుద్ధంలోకి దిగి గెలిచి తీరాల‌న్నారు.ప్రస్తుత రజనీకాంత్ ప్రకటనతో తలైవ  అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఇంక మిగిలిన నాలుగు రోజులు అభిమానులతో సమావేశమవుతారు ఆయన .ఆర్కే న‌గ‌ర్ ఉప ఎన్నిక ఫ‌లితాలు వ‌చ్చిన నాలుగు రోజుల‌కే ర‌జ‌నీ ఈ సమావేశాలు నిర్వ‌హించ‌డంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి పెరిగింది. ఈ ఉప ఎన్నిక ఫలితం తమిళ రాజకీయాల్లోపెను మార్పు తీసుకొస్తుందిఅనే చర్చ పెరుగుతుంది…అదే విధంగా రజనీకాంత్ రాజకీయ ఎంట్రీ గురించిపెద్దయెత్తునతమిళ రాజకీయాల్లోచర్చలు చోటుచేసుకుంటున్నాయి. మన కి అందుతున్న సమాచారం ప్రకారం రాజకీయ పార్టీ ఏదీ పెట్టడం లేదు అనో లేదా అన్నా డీఎంకే కి తన మద్దతు మాత్రమే ఇస్తున్నా అనో రజిని ప్రకటిస్తారు అనీ పార్టీ లాంటిది ఏమీ ఉండదు అని తెలుస్తోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here