ఇలాంటి పనులు చేసి మొనార్ఖ్ అవ్వకు మోడీ ..

దేశంలో మెట్రో రైలు పరుగులు తీస్తోంది … తాజాగా ఢిల్లీలో ప్రధాని మోదీ మెట్రో రైల్ ప్రారంభించి కొంత దూరం ప్రయాణించారు. మోడీ ప్రారంభించిన మెట్రో లైన్  మార్గం ఢిల్లీని నోయిడాతో కలుపుతుంది.మొత్తంమీద దేశంలో ఈ యాడాది ప్రారంభమైన మెట్రో రైళ్లలో ఇది మూడోది.అయితే ఢిల్లీ లో ప్రారంభమైన ఈ మెట్రో  ప్రారంభోత్సవానికి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను ఆహ్వానించకపోవడంతో ఆమ్‌ ఆద్మీ పార్టీ నేతలు మోడీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కావాలనే ప్రధానమంత్రి మోదీ కేజ్రీవాల్ను ప్రక్కన పెట్టారు , అనే వాదన వి నిపిస్తోంది. మరోపక్క ఈమెట్రో లైన్  ప్రారంభఉత్సవానికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం ఖట్టర్‌ పాల్గొన్నారు.దీంతో కేజ్రీవాల్ గైర్హాజరు విషయం రాజకీయాలలో పెద్ద దుమారం రేపుతోంది.రాజకీయ విబేధాల కారణంగానే కేజ్రీవాల్‌ను పిలవలేదని విమర్శించారు. ఈ ఆరోపణల్ని బీజేపీ కొట్టిపారేసింది.

దీన్ని బట్టి చూస్తేదేశంలో అభివృద్ధి కేవలం బిజెపి పార్టీ వల్లే సాధ్యమవుతుందని పరోక్షంగా దేశ ప్రజలకు తెలియాలని కాషాయ దళ ముఖ్యమంత్రులను వేసుకుని మోడీ ఇలా  అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటున్నారు అని  రాజకీయ విశ్లేషకులు అనుకొంటున్నారు. ఇలాంటి మూర్ఖపు నిర్ణయాల వల్లనే మొనార్ఖ్ అనే ట్యాగ్ ని మోడీ తన మీద వేసుకుంటున్నాడు అంటున్నారు చాలా మంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here