బాలకృష్ణ ని ముఖ్యమంత్రిని చెయ్యండి – రోజా సలహా

టీడీపీ అధ్యక్ష పదవికి గానీ , ముఖ్యమంత్రి హోదా కి గానీ చంద్రబాబు పనికిరారు అనీ హిందూ పురం ఎమ్మెల్యే, హీరో బాలయ్య ని టీడీపీ హెడ్ గా ఎన్నుకోవాలని వైకాపా ఎమ్మెల్యే రోజా సూచించారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె మీడియా తో మాట్లాడుతూ చంద్రబాబు కి అందరికంటే గొప్ప అవినీతి ముఖ్యమంత్రి అనే పేరొచ్చింది అన్నారు.

బాలయ్య చంద్రబాబు కంటే బెటర్ అంటూ ఎద్దేవా చేసారు ఆమె. టీడీపీ అధ్యక్ష పదవి నుంచి చంద్రబాబును రాజీనామా చేయించి, ఆ పదవిని బాలయ్యకు ఇస్తే, పార్టీకి మేలు చేకూరుతుందని జోస్యం చెప్పారు.  ” పోయిన మహానాడులో బోలెడు కహానీలు చెప్పారు . ఒక్కటైనా జరిగిందా ?? ఈ సారీ అదే పరిస్థితి. కాపు సోదరులకి రిజర్వేషన్ ఇస్తాం అంటూ అడ్డంగా హ్యాండ్ ఇచ్చారు మరి. అంతా నాటకం తప్ప ఇంకేమీ కాదు ” అన్నారు రోజా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here