మెగాస్టార్ – ప‌వ‌ర్ స్టార్ – త్రివిక్రమ్ చిత్రానికి సిద్ధమవుతున్న కథ

మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఈ ఇద్ద‌రి కాంబినేష‌న్లో సినిమా వ‌స్తే చూడాల‌నివుంది అని ఎప్ప‌టి నుంచో అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ భారీ మ‌ల్టీ స్టార‌ర్ మూవీని క‌ళా బంధు టి. సుబ్బిరామిరెడ్డి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించ‌నున్నారు. ఈ భారీ చిత్రానికి మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారన్న విషయం విదితమే.
అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందనున్న  ఈ చిత్రానికి సంబంధించిన కదను  త్రివిక్రమ్  సిద్హం చేస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల చిత్రం షూటింగ్ సమయం లో డా. టి. సుబ్బరామిరెడ్డి   వీరిద్దరినీ కలవటం జరిగింది. ఈ సందర్భంగా  ఈ చిత్రానికి సంబంధించిన కద ను సిద్ధం చే స్తున్నట్లు చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్,సుబ్బరామిరెడ్డిలకు చెప్పటం జరిగింది.
ఈ సంద‌ర్భంగా నిర్మాత క‌ళా బంధు టి.సుబ్బిరామిరెడ్డి మాట్లాడుతూ…. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల ఇమేజ్ లకు ధీటైన, ఉన్నతమైన  కథను త్రివిక్రమ్ సిద్ధం చేస్తున్నారు. మెగా బ్ర‌ద‌ర్స్ ఇద్ద‌రిని మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ ఒక్క‌రే డైరెక్ట్ చేయ‌గ‌ల‌ర‌నేది నా న‌మ్మ‌కం. త్వరలోనే ఈ  చిత్రం సెట్స్ పైకి వెళుతుంది. మెగాస్టార్ చిరంజీవి గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు, త్రివిక్రమ్ గారు  ప్రస్తుతం వారి వారి చిత్రాలతో  బిజీగా ఉన్నారు.
వీరి కమిట్మెంట్స్ పూర్తవగానే ఈ చిత్రం వైభవంగా ప్రారంభ మవు తుందని సుబ్బరామిరెడ్డి తెలిపారు.  గ్రేట్ ప్రొడ్యూస‌ర్ అశ్వ‌నీద‌త్ తో క‌లిసి ఈచిత్రాన్ని సుబ్బరామిరెడ్డి నిర్మించనున్న విషయం విదితమే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here