వ‌ర్మ ఆఫ‌ర్ అదిరింది..లక్ష్మీపార్వతి పాత్ర‌లో ఎమ్మెల్యే రోజా..?

సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ దర్శకత్వం వ‌హించ‌నున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ పై వైసీపీ న‌గ‌రి ఎమ్మెల్యే ప‌లు ఆస‌క్తిక‌ర మైన వ్యాఖ్య‌లు చేశారు. నిన్న జ‌రిగిన మీడియా స‌మావేశంలో ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ సినిమాపై ఆర్జీవీ ప్ర‌స్తావిస్తూ రాజ‌కీయాల‌కు అతీతంగా ఎన్టీఆర్‌ జీవితంలోకి లక్ష్మీపార్వతి అడుగు పెట్టిన నాటి నుంచి ఎలాంటి సంఘ‌ట‌న‌లు ఎదుర‌య్యాయి.

ఎన్టీఆర్  మృతి, వైశ్రాయ్ హోట‌ల్లో  పొలిటిక్స్  క‌హాని ఆధారంగా తెర‌కెక్కిస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.  ఈ సినిమాలో లక్ష్మీపార్వతి పాత్రకి ఎవ‌ర్ని తీసుకుంటారు.  నగరి ఎమ్మెల్యే రోజా నటిస్తారా అన్న ప్రశ్నకు ..బహుశా రోజా కూడా సినిమాలో ఉండవచ్చన్నారు. అయితే వ‌ర్మ ఆఫ‌ర్ పై రోజా స్పందించారు.

సినిమాలో డైర‌క్ట‌ర్ మంచి రోల్ ఇస్తే చేస్తాన‌ని..ఏ రోల్ అనేది త‌న‌కి తెలియ‌ద‌ని..వర్మని సంప్ర‌దిస్తే అన్నీ విష‌యాలు తెలుస్తాయ‌న్నారు. కాగా కొద్దికాలంగా వెండితెర‌కు దూరంగా ఉన్నా రోజా ..వర్మ   ఆఫర్‌పై ఆమె సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యతను సంతరించుకుంది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here