చైతూ చొక్కా లాగేసిన నాగ్‌…వైర‌ల్ పిక్‌!

ప్ర‌స్తుతం టాలీవుడ్ తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌లో నాగ చైత‌న్య‌, స‌మంత‌ల పెళ్లి గురించే మాట్లాడుకుంటున్నారు. సోష‌ల్ మీడియాలో వీరి పెళ్లి ముచ్చ‌ట్లే హాట్ టాపిక్‌. ఈ వేడుక‌లో అక్కినేని, ద‌గ్గుబాటి హీరోలు సంద‌డి చేసిన ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా స‌ర్క్యులేట్ అవుతున్నాయి. డీజే పార్టీలో నాగార్జున‌, వెంక‌టేష్, చైతూ డ్యాన్స్ చేశారు.
ఎప్పుడూ సీరియ‌స్ లుక్ ను మెయింటెన్ చేసే నిర్మాత ద‌గ్గుబాటి సురేష్ ఈ వేడుక‌లో స‌మంత‌తో క‌ల‌సి చిందులేశారు. ఆ వీడియోల‌కు అక్కినేని, ద‌గ్గుబాటి అభిమానులు ఫిదా అయిపోతున్నారు.
హిందూ, క్రైస్తవ సంపద్రాయ పద్ధతుల్లో చై-సామ్ ల పెళ్లి క‌న్నుల‌పండువ‌గా జ‌రిగింద‌ని లీకైన వీడియోల‌ను బ‌ట్టి తెలుస్తోంది. ఈ వేడుక సందర్భంగా జరుపుకున్న అక్కినేని, దగ్గుబాటి కుటుంబాల వారు ఆట‌పాట‌ల‌తో హోరెత్తించారు. ఈ పెళ్ళి సంద‌ర్భంగా అక్క‌డ ఉన్న కుర్ర‌కారు కంటే నాగ్ బాగా హ‌ల్ చ‌ల్ చేశాడు.
ఈ న‌వ మ‌న్మ‌థుడు పెళ్లి కొడుకు చొక్కా లాగేసి హ‌ల్ చ‌ల్ చేశాడట. తాజాగా, ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఆ ఫొటోలో వారిద్ద‌రూ తండ్రీ కొడుకుల్లా కాకుండా స్నేహితుల్లాగా ఎంజాయ్ చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here