‘జెనీలియా భర్త.. రితేష్’‌ అంటే కోపమొచ్చింది..

బొమ్మరిల్లు సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న నటి జెనీలియా కెరీర్‌ మంచి జోష్‌ మీదున్న సమయంలోనే నటుడు రితేష్‌ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ జంట ఒక కామెడీ షోలో పాల్గొంది. ఈ సందర్భంగా రితేష్‌ తనకు ఎదురైన ఓ సంఘటన గురించి చెప్పుకొచ్చాడు.

ఆ విషయమై రితేష్‌ మాట్లాడుతూ..‘మాకు వివాహమైన తర్వాత కొంతకాలానికి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ కోసం బెంగళూరు వచ్చాను. ఆ సమయంలో క్రికెట్ లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు నన్ను చూసి జెనీలియా భర్త ఇతనే అని చెప్పుకొచ్చారు. ఆ మాటతో నాకు కోపం వచ్చింది. నా ఇగో హర్ట్ అయింది. వెంటనే వాళ్ల దగ్గరికి వెళ్లి దక్షిణాదిలో మాత్రమే ‘జెనీలియా భర్త రితేష్’. మహారాష్ట్ర లో మాత్రం ‘రితేష్ భార్య జెనీలియా’ అని సమాధానమిచ్చాను.. సార్‌.. ‘రితేష్ భార్య జెనీలియా’ ఇది కేవలం ఒక మహారాష్ట్రకి మాత్రమే. జెనీలియా భర్త రితేష్ అనేది కేరళ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక అన్ని రాష్ట్రాలలో ఉంటుంది. వాళ్లు చెప్పిన మాటతో నాకు బాగా నవ్వు వచ్చింది’ అంటూ అప్పటి సంఘటనను గుర్తు చేసుకున్నారు రితేష్‌.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here