రాంగోపాల్ వ‌ర్మ సినిమాపై కోర్టు కీల‌క ఉత్త‌ర్వులు

సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ‌కు షాక్ త‌గిలింది. ఇటీవ‌ల ఆయ‌న తీస్తున్న సినిమా విష‌యంలో  ఎదురుదెబ్బ త‌గిలింది. ఈ మేర‌కు కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది.

న‌ల్గొండ‌లో సంచ‌ల‌నం సృష్టించిన అమృత ప్ర‌ణ‌య్‌ల ప్రేమ వివాహం, ప్ర‌ణ‌య్ హ‌త్య‌కు సంబంధించిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే డైరెక్ట‌ర్‌ రాంగోపాల్ వ‌ర్మ మ‌ర్డ‌ర్ అనే సినిమా తీస్తున్నారు. అయితే ఈ సినిమా త‌మ జీవితానికి సంబంధించిన‌దే అంటూ అమృత కోర్టును ఆశ్ర‌యించారు. సినిమా తీస్తున్నా త‌మ‌ను ఎవ్వ‌రూ సంప్ర‌దించ లేద‌న్నారు. త‌మ కులాన్ని కించ‌ప‌రిచేలా సినిమా తీస్తున్నార‌ని అమృత త‌రుపు న్యాయ‌వాది పిటిష‌న్‌లో పేర్కొన్నారు.

సినిమా వ‌ల్ల‌ ప్ర‌ణ‌య్ హ‌త్య కేసు త‌ప్పుదారి ప‌డుతుంద‌ని కోర్టుకు విన్న‌వించారు. దీంతో ఇరువురి వాద‌న‌లు విన్న అనంత‌రం సినిమాను నిలిపివేయాలంటూ నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది. అయితే వ‌ర్మ త‌రుపు న్యాయ‌వాదులు ఈ కేసులో హైకోర్టుకు వెళ్ల‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇక వ‌ర్మ‌కు వివాదాలు కొత్తేమీ కాదు. ఆయ‌న తీస్తున్న ఏ సినిమా అయినా వివాదాస్ప‌దంగానే ఉంటుంది. తాజాగా ఆయ‌న‌కు కోర్టులో ఇలా చుక్కెదుర‌వ్వ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here