లంచం తీసుకుంటే వెంట‌నే చ‌ర్య‌లు…?

రాష్ట్రం అభివృద్ధి చెంద‌డంతో పాటు, ప్ర‌జలు మెచ్చిన సంక్షేమ ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెడుతూ దేశంలోనే పేరు తెచ్చుకుంటున్న ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మ‌రిన్ని చారిత్రక నిర్ణ‌యాలు తీసుకునేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇప్ప‌టికే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాలు ఏర్పాటుచేసి ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే పాల‌న అన్న‌ట్లుగా ముందుకు సాగుతున్న ఆయ‌న అవినీతి లేని రాష్ట్రంలో చేసేందుకు క‌స‌ర‌త్తులు చేస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇందులో భాగంగానే అధికారుల‌తో స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ప్ర‌ధానంగా అధికారులు లంచం తీసుకుంటూ దొరికిపోతే నిర్దిష్ట స‌మ‌యంలోనే చ‌ర్య‌లు తీసుకునేలా బిల్లు తీసుకురావాల‌ని సీఎం జ‌గ‌న్ ఉన్న‌తాధికారుల‌కు స్ప‌ష్టం చేసిన‌ట్లు స‌మాచారం. ఈ మేర‌కు  అవినీతి నిరోధం, ప్ర‌భుత్వ చ‌ర్య‌ల‌పై ఆయ‌న అధికారుల‌తో నిర్వ‌హించిన స‌మీక్షలో చ‌ర్చించారు. అవినీతి పై దిశ త‌ర‌హాలోనే అసెంబ్లీలో బిల్లు పెట్టాల‌ని జ‌గ‌న్‌ ఆదేశించారు.

1902 నంబ‌ర్‌కు వ‌చ్చే అవినీతికి సంబంధించిన అంశాల‌న్నీ అవినీతి నిరోధక శాఖ‌కు చెందిన 14400 నంబ‌ర్‌కు బ‌దలాయించాల‌ని ఆయ‌న చెప్పారు. గ్రామ వార్డు స‌చివాల‌యాల నుంచి వ‌చ్చే ఫిర్యాదుల‌ను దీనికి అనుసంధానించాల‌ని సీఎం జ‌గ‌న్ అన్నారు. ఎమ్మార్వో, ఎండీవో, స‌బ్ రిజిస్ట్రార్, మున్సిప‌ల్, టౌన్ ప్లానింగ్  విభాగాల్లో అవినీతిపై ప్ర‌ధానంగా దృష్టి సారించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

ఇక ప్ర‌భుత్వంలోని ప్ర‌తి విభాగంలోనూ రివ‌ర్స్ టెండ‌రింగ్ నిర్వ‌హించాల‌న్నారు. టెండ‌ర్ విలువ రూ. కోటి దాటితే రివ‌ర్స్ టెండ‌రింగ్‌కు వెళ్లాల్సిందేన‌ని జ‌గ‌న్‌ స్ప‌ష్టం చేశారు. ప్ర‌జ‌ల‌కు ప్ర‌భుత్వంపై న‌మ్మ‌కం ఉండేలా అధికారులు వ్య‌వ‌హ‌రించాల‌న్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here