టీడీపీ, కాంగ్రెస్ లో చిచ్చుపెట్టిన ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి పార్టీ కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకుంటున్నారన్న విషయం  తెలిసిందే. అయితే ఒక్క దెబ్బకు రెండు పిట్టలు అన్న ఫంథాలో టీడీపీ, కాంగ్రెస్ లో రేవంత్ చిచ్చుపెట్టినట్లు తెలుస్తోంది. టీటీడీపీ లో ఇన్ని రోజులు పెద్ద దిక్కుగా ఉన్న రేవంత్ పార్టీ మారడంపై ఆ పార్టీ పరిస్థితి తెగిన గాలిపటంలా తయారైంది.

ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది నేతల పరిస్థితి అలాగే ఉన్నట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి మాస్ ఫాలోయింగ్, కేసీఆర్ ను ఎదిరించగలిగే ధైర్యం, ప్రభుత్వాన్ని, ప్రభుత్వ పనితీరు ఇరుకున పెట్టే గట్స్ నాయకుడు కావాలి. ఆ లక్షణాలు రేవంత్ లో ఉన్నాయి.

ఒకవేళ రేవంత్ పార్టీలోకి వస్తే ముందుగా దెబ్బపడేది ఉత్తమ్ కుమర్ రెడ్డికే అంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్.  ఎందుకంటే ఓ పార్టీ అధ్యక్షుడంటే హంగు ఆర్భాటాలు వేరు. అదే సాధారణనేత అంటే ఎవరు పట్టించుకోరు. ఇలాంటి విషయాలన్నీ ఉత్తమ్ కు వ్యతిరేకంగా ఉన్నాయి.

ఇదిలా ఉంటే మహబూబ్ నగర్ లో రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని ప్లాన్ వేసింది. కానీ రేవంత్ పార్టీ చేరికతో సభను వాయిదా వేసి..హైదరాబాద్ లో నిర్వహించి రేవంత్ కు హస్తం కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించాలని అధిష్టానం భావిస్తున్నట్లు గుసగుస.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here