త్రివిక్రమ్ కే ఝలక్ ఇచ్చిన పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్త్తున్న కొత్త సినిమా కి ఇంకా టైటిల్ పెట్టలేదు మేకర్ లు. pspk25 అని పిలుస్తున్నారు ఫాన్స్ .ఇప్పటి వరకూ సోషల్ మీడియా లో అజ్ఞాతవాసి అనే టైటిల్ మాత్రం వాడుకలో ఉంది. ఈ సినిమా షూటింగ్ దాదాపు ఎనభై శాతం పూర్తి అయిపొయింది.
అయితే జనవరి 10 న విడుదల కాబట్టి ఇలోగా నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేద్దాం లే అని ఫిక్స్ అయిన త్రివిక్రమ్ కి పవన్ కళ్యాణ్ ఒక ఝలక్ ఇచ్చాడు. సాధ్యమైనంత త్వరగా షూటింగ్ పూర్తి చేసి తన టైం ఎక్కడా వేస్ట్ చెయ్యకుండా రాజకీయాల మీద దృష్టి పెట్టాలి అనే ఆలోచనలో ఉన్న పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ కి ఒక కండిషన్ పెట్టాడట. ఈ సినిమా షూటింగ్ ను నవంబర్ 25 నాటికి పూర్తి చేయమని త్రివిక్రమ్ కి చెప్పాడట.
 ఆ దిశగా త్రివిక్రమ్ పనులను వేగవంతం చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగానే ఈ నెల 21వ తేదీ నుంచి వచ్చేనెల 15వ తేదీ వరకూ యూరప్ లో చివరి షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here