ప్లాప్ దశగా రాజుగారి గది 2 ?

నాగార్జున .. సమంత .. శీరత్ కపూర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ‘రాజుగారి గది 2’ .. ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో తొలివారాంతంలో ఈ సినిమా 9.58 కోట్లను కొల్లగొట్టింది. దాంతో ఈ సినిమా టీమ్ ఫుల్ ఖుషీ అయింది. ముఖ్యంగా సమంత సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఈ నేపథ్యంలో సోమవారం రోజున ఈ సినిమా వసూళ్లు భారీగా పడిపోవడం కలవరపెడుతోంది.
సాధారణంగా వీకెండ్ తరువాత వచ్చే సోమవారానికి వసూళ్లు కొంతవరకూ తగ్గుతాయి. కానీ ఈ సినిమాకి భారీగా తగ్గడం ఆలోచనలో పడేస్తోంది. దీనికి తోడు ‘రాజా ది గ్రేట్’ .. ‘అదిరింది’ గట్టిపోటీని ఇవ్వనున్నాయి. ఈ రోజు నుంచి వీకెండ్ వరకూ హాలిడేస్ మూడ్ ఉండటంతో, ఈ సినిమా వసూళ్లు పుంజుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. రవితేజ .. విజయ్ సినిమాల పోటీని తట్టుకుని ‘రాజుగారి గది 2’ నిలబడుతుందా? పడిపోయిన వసూళ్లు మళ్లీ పుంజుకుంటాయా? అనేది ఆసక్తికరంగా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here