గుంటూరు జిల్లాలో వ్య‌క్తి మృతి.. లాకప్ డెత్ పై అనుమానాలు

గుంటూరు జిల్లా రేప‌ల్లె పోలీస్ స్టేష‌న్లో ఓ వ్య‌క్తి మృతి చెంద‌డం ఇప్పుడు వివాదాస్ప‌దంగా మారింది. ఈ వ్య‌క్తిని లాక‌ప్ డెత్ చేశారంటూ ప‌లువురు పుకార్లు సృష్టిస్తున్నారు. రాత్రంతా కొట్టి సృహ కోల్పోయిన త‌ర్వాత హాస్పిట‌ల్‌కు త‌ర‌లించార‌ని చెబుతున్నారు.

రాఘ‌వేంద్ర అనే వ్యక్తిని ఓ కేసులో అదుపులోకి తీసుకొని విచార‌ణ‌లో భాగంగా పోలీసులు తీవ్రంగా కొట్టార‌ని ప‌లువురు చెబుతున్నారు. రాఘ‌వేంద్ర కుటుంబ స‌భ్యుల‌కు కూడా విష‌యం తెలియ‌ద‌ని తెలుస్తోంది. ఇక ఈ విష‌యంపై పోలీసులు స్పందించారు. బాప‌ట్ల డీఎస్పీ శ్రీ‌నివాస‌రావు మాట్లాడుతూ రేప‌ల్లె స్టేష‌న్లో లాక‌ప్ డెత్ జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. రాఘ‌వేంద్ర అనే వ్య‌క్తి రేప‌ల్లెలో ప‌లువ‌రు చిరు వ్యాపారుల వ‌ద్ద మోసాల‌కు పాల్ప‌డిన‌ట్లు చెప్పారు. వారు ఫిర్యాదు చేసినందుకే రాఘ‌వేంద్ర‌ను అదుపులోకి తీసుకున్న‌ట్లు తెలిపారు.

అయితే రాఘ‌వేంద్ర‌కు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించాయ‌న్నారు. ఆయన్ను హాస్పిట‌ల్‌కి తీసుకెళ్లి క‌రోనా టెస్టులు చేపించే ప్ర‌య‌త్నం చేశామ‌న్నారు. శ్వాస స‌మ‌స్య‌తో ఇబ్బంది ప‌డుతూ చ‌నిపోయిన‌ట్లు చెప్పారు. రాఘ‌వేంద్ర‌ చిల్లర మోసాలకు పాల్పడుతూ ఉంటాడని డీఎస్పీ చెప్పారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here