చీర కట్టులో అదరగొడుతోన్న రీతూ వర్మ..

పెళ్లి చూపులు సినిమాతో ఇండస్ట్రీని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది అందాల తార రీతూ వర్మ. తనదైన నటన, క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకున్న ఈ చిన్నది తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకుంటోంది. క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా కెరీర్‌ మొదలు పెట్టి ఇప్పుడు అగ్ర కథానాయికల్లో ఒకరిగా స్థానం సంపాదించుకోవడానికి అడుగులు వేస్తోంది.

ప్రస్తుతం నాని హీరోగా తెరకెక్కుతోన్న టక్‌ జగదీష్‌లో నటిస్తోన్న రీతూ తాజాగా రవితేజ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ కొట్టేసింది. ఈ సినిమాతో సీనియర్‌ హీరోయిన్లకు సైతం పోటీనివ్వడానికి సిద్ధమవుతోందీ అమ్మడు. ఇక సినిమాలతో నిత్యం బిజీగా ఉండే రీతూ.. సోషల్‌ మీడియాలోనూ తనదైన శైలిలో దూసుకెళుతోంది. తన లేటెస్ట్‌ ఫొటో షూట్‌లకు సంబంధించిన ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకోవడం రీతూకు అలవాటు. ఈ క్రమంలోనే తాజాగా చీర కట్టులో దిగిన కొన్ని ఫొటోలను ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేసిందీ చిన్నది. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. మరి ఆ ఫొటోలపై మీరూ ఓ లుక్కేయండి..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here