తమిళంలోకి ఎంట్రీపై ఎమోషనల్‌ ట్వీట్‌ చేసిన రష్మిక..

కన్నడ భాషతో వెండి తెరకు పరిచయమైన అందాల తార రష్మిక మందన్న అనంతరం తెలుగులోనూ తన సత్తా చాటుకుంటుందీ చిన్నది. మహేష్‌ బాబు, బన్నీ వంటి టాప్‌ హీరోల సరసన నటించే అవకాశం సొంతం చేసుకొని టాలీవుడ్‌లో సుస్థిర స్థానం సంపాదించుకునే దిశలో వెళుతోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తమిళంలోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. తాజాగా కార్తీ హీరోగా నటిస్తున్న సుల్తాన్‌ చిత్రంలో ఈ అమ్మడు నటిస్తోంది. రష్మికకు ఇదే తొలి తమిళ సినిమా కావడం విశేషం. ఇక తమిళంలోకి ఎంట్రీ ఇవ్వడం పట్ల తన మనసులోని మాటను చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

తమిళ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వడంపై స్పందించిన రష్మిక.. ‘చిన్నప్పటి నుంచి నాన్న, నేను కలిసి చాలా తమిళ సినిమాలు చూసేవాళ్లం. ఇప్పుడు ఇంత పెద్ద తమిళ సినిమాలో నేను నటించడం నమ్మలేకపోతున్నా. అద్భుతమైన వ్యక్తులతో కలిసి పనిచేసే అరుదైన అవకాశం దక్కింది. ఇందుకు నేను కృతజ్ఞురాలిని’ అని కాస్త ఎమోషనల్‌ ట్వీట్‌ చేసింది. మరి తెలుగు, కన్నడంలో తన సత్తా చాటుకున్న రష్మిక తమిళంలో ఎంత వరకు రాణిస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here