అదిరింది సినిమా మాటిమాటికీ వాయిదా కారణమిదే ?

తమిళంలో విడుదలై ఇటు కలెక్షన్ల పరంగా, అటు వివాదాల పరంగా సంచలనం సృష్టించిన ‘మెర్సల్’ తెలుగు వర్షన్ ‘అదిరింది’ నేడు కూడా వెండి తెరలను తాకలేదు. నేడు సినిమా విడుదల అవుతుందని రెండు రోజుల క్రితమే పబ్లిసిటీ ఇచ్చిన నిర్మాతలు, ఆన్ లైన్లో టికెట్లు బుకింగ్ కూడా చేసేశారు. కానీ ఈ ఉదయం థియేటర్ వద్దకు వెళ్లిన ప్రేక్షకులకు చిత్రం విడుదల మరోసారి వాయిదా పడిందన్న కబురు వినిపించింది. దీంతో పలువురు సినీ ప్రేక్షకులు థియేటర్ల వద్ద నిరసనలకు దిగారు.
కాగా, ఈ చిత్రంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులను తొలగించాలని సెన్సార్ బోర్డు సభ్యులు కోరగా, ఓ భాషలో అవే డైలాగులకు ఓకే చెప్పిన తరువాత, మరో భాషలో డైలాగులు తీసేయమని ఎలా చెబుతారని అడుగుతూ, యూనిట్ అందుకు వ్యతిరేకించింది.
ఈ వ్యవహారం కారణంగానే ‘అదిరింది’ నేటి విడుదల వాయిదా పడ్డట్టు తెలుస్తోంది. త్వరలో సినిమా విడుదలకు సంబంధించిన మరో తేదీని ప్రకటిస్తామని చిత్ర నిర్మాత ప్రకటించారు. ఈ చిత్రంలో వస్తు సేవల పన్నుకు వ్యతిరేకంగా డైలాగులు ఉండటంతో వాటిని తొలగించాలని బీజేపీ పట్టుబడుతున్న సంగతి తెలిసిందే.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here