అనిల్ రావిపూడి ని పిలిపించిన అల్లూ అరవింద్

యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీని మిక్స్ చేస్తూ కథలను రెడీ చేసుకోవడంలో దర్శకుడు అనిల్ రావిపూడి సిద్ధహస్తుడు. ఈ తరహాలో ఆయన తెరకెక్కించిన ‘పటాస్’ .. ‘సుప్రీమ్’ .. ‘రాజా ది గ్రేట్’ భారీ విజయాలను అందుకున్నాయి. ఈ మూడు సినిమాలతో ఆయన మాస్ ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేశాడు. దాంతో మాస్ సినిమాలు చేయాలనే స్టార్ హీరోల దృష్టి ఇప్పుడు ఆయనపై పడింది.
 అంతేకాదు స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ దృష్టిలోనూ పడిపోయాడు. కథా కథనాలను అనిల్ నడిపించే తీరు .. ఆయన టేకింగ్ నచ్చేయడంతో అల్లు అరవింద్ ఆయనని పిలిపించారట. అల్లు అర్జున్ కోసం మంచి కథను సిద్ధం చేయమని చెప్పారట. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ సినిమా వుండనున్నట్టు చెప్పుకుంటున్నారు.
‘నా పేరు సూర్య’ తరువాత లింగుస్వామితో గానీ .. విక్రమ్ కుమార్ తో గాని అల్లు అర్జున్ చేయవచ్చనే టాక్ వినిపిస్తూ వచ్చింది. ఇప్పుడేమో అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది. అల్లు అర్జున్ ముందుగా ఎవరితో సెట్స్ పైకి వెళతాడో చూడాలి మరి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here