మాధవన్ ని నాలుగు కోట్లు పెట్టి పట్టుకొచ్చారు

నాగచైతన్య కథానాయకుడిగా చందూ మొండేటి ‘సవ్యసాచి’ సినిమాను తెరకెక్కించడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. చందూ మొండేటి ఇంతకుముందు ‘కార్తికేయ’ .. ‘ ప్రేమమ్’ వంటి సూపర్ హిట్స్ ను ఇవ్వడం వలన, సహజంగానే ఈ ప్రాజెక్టుపై అందరిలోను ఆసక్తి వుంది.
మైత్రీ మూవీస్ బ్యానర్ పై నిర్మితమవుతోన్న ఈ సినిమాలో ఒక ప్రత్యేకమైన పాత్ర కోసం మాధవన్ ను తీసుకున్నారు. ఇందుకోసం ఆయనకి ఇస్తోన్న పారితోషికం నాలుగు కోట్లని సమాచారం.
 ఈ సినిమాను తమిళంలోను విడుదల చేయాలనేది ఆలోచన. మాధవన్ వలన అక్కడ సినిమా బిజినెస్ .. శాటిలైట్ రేటు బాగుంటుందని భావిస్తున్నారట. ఏదేమైనా, ఒక స్పెషల్ రోల్ కి ఈ స్థాయి రెమ్యునరేషన్ ఇవ్వడం .. ముఖ్యంగా హీరో అందుకునే పారితోషకం కన్నా అది ఎక్కువగా ఉండటం ఇప్పుడు ఫిల్మ్ నగర్లో హాట్ టాపిక్ గా మారింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here